విజయవాడ : క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా విద్యాధరపురం పిల డెల్పియ ఎజి చర్చిలో జరిగిన యేసు క్రీస్తు జన్మదిన వేడుకలలో సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస కుమార్ పాల్గోని దైవ సేవకులు బ్రదర్ జకబ్ పి చార్లెస్ ద్వార దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా దైవ సేవకులు బ్రదర్ జాకబ్ పి చార్లెస్ గారికి పూల బొక్కే అందజెసి క్రిస్టమస్ శుభ కాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా క్రైస్తవ సోదర సోదరీమణులను ఉదేశించి ఆకుల శ్రీనివాస కుమార్ ప్రసంగిస్తూ పాపులను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనకొరకు జన్మించడం జరిగింది. ప్రేమ శాంతి త్యాగం క్రీస్తు బోధించి సందేశాన్ని ప్రతి ఒక్కరు అలవర్చు కొని స్నేహ బంధాలు పెంచు కోవాలని కోరారు. భక్తి శ్రద్ధలతో ప్రార్ధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పండుగ శుభ కాంక్షలు తెలిపారు. విజయవాడ నగరంలో ఉంటున్న క్రైస్తవులకు ప్రభువైన యేసుక్రీస్తు మంచి దైవ సేవకులు బ్రదర్ జాకబ్ పి చార్లెస్ ని ఇవ్వడం మన అదృష్టం అని అన్నారు. ఈ కార్య క్రమంలో పొదిలి చంటి బాబు, మేళం చిన్నా, సలీం ఫర్వాజ్, అల్లం పూర్ణ చంద్ర రావు, యరజర్ల మురళి తదితరులు పాల్గొన్నారు.