ఏపీ ఎఫ్ డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి సంతాపం
విజయవాడ : ప్రసిద్ధ సినీ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి మేనేజింగ్ డైరెక్టర్
టి.విజయకుమార్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 750కి పైగా పౌరాణిక,
సాంఘిక, జానపద చిత్రాలలో నటించిన విలక్షణమైన నటుడిగా నవరస నటనా సార్వభౌముడిగా
పేరు ప్రఖ్యాతలు గడించిన కైకాల తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవ చేసారని ఆయన
తెలిపారు. రఘుపతి వెంకయ్య అవార్డు, నందీ అవార్డులను గెలుచుకున్న కైకాల
సత్యనారాయణ నాటక రంగం పునాదిగా నటనా జీవితాన్ని ప్రారంభించి అనేక విలక్షణ
పాత్రల్లో అశేష ప్రేక్షకులను అలరించారని ఎఫ్ డి సి ఎండి అన్నారు. కైకాల కుటుంబ
సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.