బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
ఒంగోలు : రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష
పార్టీలను గొంతు గొంతు విప్పకుండా అడ్డుకుంటున్నారని, ఏకపక్షంగా
అణిచివేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో రాయలసీమ, కోస్తా జోన్ పదాథికారుల సమావేశం జరిగింది.
ఈసందర్భంగా పార్టీ శ్రేణులను ఏవిధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలన్న అంశం పై
దిశానిర్దేశం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ
క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర స్థాయి నాయకులు పని చేసి న
సందర్భంగా మాత్రమే లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎపి సహా
ఇంఛార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ
శూన్యత ఉందని మనం అంది పుచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర
అధ్యక్షుడు సోమువీర్రాజు మీడియా తో మాట్లాడారు. డిసెంబర్ 25న మాజీ ప్రధాని
వాజ్ పేయి జన్మదిన సందర్భంగా సుపరిపాలన దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో పోలీసు ఎంపికల్లో మూడేళ్లు వయస్సు సడలింపు ఇవ్వాలన్నారు. పోలీసు
రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారని, అందువల్ల యువతలో నైరాశ్యం ఏర్పడకుండా ప్రభుత్వం
చర్యలు చేపట్టాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని కోరారు. తెలంగాణలో టిఆర్ఎస్
కు విఆర్ఎస్ ఖాయం అని, 2023 ఎలక్షన్ తర్వాత ఆ పార్టీ కనుమరుగవుతుందని,
ఆంధ్రులను ద్వేషించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన కేసీఆర్ కు జాతీయ
పార్టీ పెట్టే నైతిక హక్కు లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.