విజయవాడ : భారత మాజీ ప్రధాని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు
స్వర్గీయ పి.వి.నరసింహ రావు వర్ధంతి కార్యక్రమం శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్
కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
నరసింహ రావు ప్రధానిగా భారత దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, క్లిష్ట
సమయాల్లో దేశంలో ఆర్ధిక సంస్కారాలను ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన భారతదేశ
ఆధునిక నిర్మాత అని కొనియాడారు. ప్రధానిగా పివి ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం
ఆర్థికంగానే కాకుండా అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో
గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు. భారతదేశం ఆర్ధిక సంక్షోభంలో
వున్నపుడు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన చాణుక్యుడు అని, దేశ
రాజకీయాల్లో తెలుగు వారి పేరు ప్రతిష్టలు ఇనుమడింపచేసిన బహుభాషా ప్రావీణ్యుడు
పి.వి.నరసింహారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు
నరహరశెట్టి నరసింహా రావు, ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం, పిసిసి
కార్యదర్శి మేడా సురేష్ తదితరులు పాల్గొన్నారు.