ఢిల్లీలో తన గళం వినిపించిన నేటి గాంధీ ఆర్ ఆర్ నాగరాజన్
25 మంది ఎంపీలకు వినతిపత్రాలు అందించిన నేటి గాంధి
విజయవాడ : దేశంలో, రాష్ట్రాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని
విజయవాడ నగరం నుండి డిల్లీకి వెళ్లి తనగళాన్ని విన్పించిన నేటి గాంధీ ఆర్ ఆర్
గాంధీ నాగరాజన్ అక్కడ 25 మంది ఎమ్ పి లను స్వయంగా కలిసి వినతిపత్రం అందించానని
తెలిపారు. గురువారం ఊర్మిలా నగర్ లోని గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు
చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అక్కడ ఎంపీ లకి వినతిపత్రం అందించిన ఫోటోలు
మీడియా కి చూపించారు. స్వతంత్ర సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు అయిన నేటికీ
అంబేద్కర్ గాంధీ కలలు కన్న స్వరాజ్యం రాలేదని మహిళలకు రాజకీయ రంగంలో 33 శాతం
రిజర్వేషన్ అమలు జరగాలని గాంధీయవాది గాంధీ నాగరాజన్ అన్నారు. రాజకీయ రంగంలో
మహిళలకు 33 శాతం రిజర్వేషన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాలని
డిసెంబర్ 17న దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష
చేపట్టినట్లు తెలియజేశారు. ఈ నిరాహార దీక్షకు మహిళల వద్ద నుండి పెద్ద ఎత్తున
స్పందన వచ్చిందని అన్నారు. ఇదే విషయమై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25
మంది ఎంపీలకు రాజకీయ రంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని వినతి
పత్రాలు అందజేయడం జరిగిందని చెప్పారు. వినతి పత్రాలు అందుకున్న ఎంపీ లందరూ
సానుకూలంగా స్పందించారని తెలిపారు. రానున్న రోజుల్లో కళాశాలలకు, పాఠశాలలకు,
మహిళా సంఘాల వద్దకు వెళ్లి పార్లమెంటుకు ఉత్తరాలు వ్రాసే విధంగా మహిళలను
ప్రోత్సహిస్తామని వివరించారు. భారత దేశంలోని ప్రతి రాష్ట్రం లో 21 రోజులు
రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు
వివరించారు.అంబేద్కర్, మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దేశానికి రక్షణగా ఉంటాయని
అన్నారు. నేడు రాజకీయాల్లో విలన్లను గెలిపిస్తున్నారని నిరాశ వ్యక్తం చేశారు.
ఓటుని నమ్ముకుని బ్రతకాలి, అమ్ముకొని కాదని ఓటర్లకు సూచించారు. గాంధీ
నాగరాజన్ తో పాటు విద్యార్థిని బంగారు భారతి స్త్రీలకు అన్ని రంగాలలో 33 శాతం
రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలు జరగాలని పాల్గొన్నారు. భారతి మాట్లాడుతూ
స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ పూర్తిస్థాయిలో అమలు జరిగే వరకూ పోరాడతానని
చెప్పారు.అలాగే మరణాన్ని ప్రేమిస్తా …ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా అని
ప్రకటించారు.