వెలగపూడి : రుషికొండ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర
ప్రభుత్వ అధికారులతో కమిటీ వేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఏపీ హైకోర్టు
ఆదేశించింది. విశాఖలోని రుషికొండపై అనుమతులకు మించి తవ్వకాలు జరుపుతున్నారని
దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొండపై తవ్వకాలు, నిర్మాణాలను
క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ వేయాలని
కేంద్ర పర్యావరణ, అటవీశాఖను హైకోర్టు ఆదేశించింది. జనవరి 31లోపు తవ్వకాలు,
నిర్మాణాలపై పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదికను తమకు సమర్పించాలని
న్యాయస్థానం ఆదేశించింది. ఐదుగురు కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు
చెందిన వారినే నియమించాలని స్పష్టం చేసింది. రాష్ట్రానికి చెందిన అధికారులను
కమిటీ నుంచి తొలగించాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. విశాఖ
జిల్లా రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారని విశాఖ
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన నేత మూర్తి యాదవ్ పిటిషన్లు దాఖలు
చేశారు. పిటిషన్లపై విచారించిన ధర్మాసనం క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర
ప్రభుత్వ అధికారులతో కమిటీని నియమించాలని ఆదేశించింది. అయితే, ఆ కమిటీలో
ముగ్గురు రాష్ట్రానికి చెందిన అధికారులు ఉండటంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు.
తాజాగా పిల్‌పై విచారించి నూతన కమిటీని నియమించాలని న్యాయస్థానం ఆదేశించింది.