తిరుపతి: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి(76) సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందిన
విషయం తెలిసిందే. శ్వాస సంబంధ సమస్యతో గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్న ఆయన
సోమవారం రాత్రి ఊపిరి తీసుకోవడానికి అవస్థపడటంతో కుటుంబ సభ్యులు విమ్స్
ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో ఆయన
తుదిశ్వాస విడిచారు. అయితే, చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ
సభ్యులను పరామర్శించారు. భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని సీఎం జగన్ ఓదార్చారు. ఈ
సందర్భంగా కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.