బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
కాకినాడ : కోస్తా జోన్ పదాదికారుల సమావేశం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము
వీర్రాజు అధ్యక్షతన గురువారం జరిగింది. కాకినాడలో నిర్వహించిన ఈ సమావేశంలో
పార్టీ సంస్థాగత నిర్మాణం పైనే దృష్టి కేంద్రీకరించాలని బిజెపి రాష్ట్ర
అధ్యక్షుడు సోము వీర్రాజు ఉద్బోధించారు. పోలింగ్ బూత్ స్థాయి లో మండలకేంద్రాల
స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తే పేజ్ ప్రముఖ్ లు నియామకం
వీలుకలుగుంతుందన్నారు. స్థానిక సమస్యల పై దృష్టి కేంద్రీకరించాలన్నారు.
గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు అంశాన్ని పార్టీ ప్రధానంగా
తీసుకోవాలన్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల లో జరిగిన ఎన్నికల పని విషయాలు ఎపి
సహా ఇంఛార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ వివరించారు. బిజెపి
క్షేత్రస్థాయిలో నాయకులు పోలింగ్ బూత్ స్థాయి లో పార్టీ పటిష్టతకు పని చేయాలని
బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ వివరించారు.