ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటిన మల్లాది విష్ణు
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమం,
అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఏపీ
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే
ఆధ్వర్యంలో మంగళవారం అయోధ్యనగర్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పేద
ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో
ఉండాలని తొలుత గంగానమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అంతా మంచే
జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు
దిగ్విజయంగా కొనసాగాలని కోరుకున్నారు.
అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రజల మంచిని కోరుకునే నాయకుని జన్మదినాన్ని
పురస్కరించుకుని ఏటా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలను
నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది తొలి రోజు మొక్కలు నాటే
కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాలకు
అనుగుణంగా ప్రజల తాలుకా ఆకాంక్షలను అనుసరించి రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్
సుపరిపాలన అందిస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. విప్లవాత్మక నిర్ణయాలు,
చరిత్రాత్మక పథకాలతో అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్నారన్నారు.
విభజన సమస్యలు చుట్టుముట్టినా సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రాన్ని ముందుకు
నడిపించారన్నారు. విపత్తుల సమయంలోనూ పేద ప్రజలకు అండగా నిలిచారని
పేర్కొన్నారు. కరోనా కట్టడికి సీఎం తీసుకున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా
నిలిచాయని మల్లాది విష్ణు వివరించారు.
నవరత్నాలతో నవయుగానికి నాంది పలికిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా
నిలవాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే ఈనెల 21న ఐ.వి.ప్యాలస్ నందు లబ్ధిదారుల
సమక్షంలో నిర్వహించనున్న జన్మదిన వేడుకలను జయప్రదం చేయాలని మల్లాది విష్ణు
పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు,
నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండె
సుభాషిణి, హెచ్.ఓ.(పార్కు) ఎం.నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంచార్జి
గుండె సుందరపాల్, నాయకులు ఒగ్గు గవాస్కర్, ఎల్.శ్రీనివాసరావు, ఆదిరెడ్డి,
శ్యామ్, దుర్గాప్రసాద్, వీరంకి నాగు, సువర్ణరాజు, శివన్న, సురేష్, జగన్,
వీఎంసీ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పేదవాడి మనసెరిగిన నాయకుడు జగన్
విజయవాడ : రాష్ట్రంలో ప్రతిఒక్క పేదవాడి మనసెరిగి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వాంబేకాలనీ డిస్నీల్యాండ్ వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కుల, మత, ప్రాంత, వర్గ భేదాలు చూడకుండా ప్రజలందరికీ మేలు చేసేలా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారని, ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో తెలుసుకున్న ప్రతిఒక్క సమస్యను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత అభ్యున్నతికి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. గ్రామ స్వరాజ్యం ఆకాంక్షతో సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేసి ప్రతి ఇంటి గడపకు సంక్షేమ పథకాలను చేరువ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని మల్లాది విష్ణు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానన్ని సంక్షేమ కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మన రాష్ట్రంలో అమలవుతున్నట్లు వివరించారు. ఉన్న వనరులను సద్వినియోగపరచుకుంటూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి అడుగులు వేస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గత పాలకుల కారణంగా చిన్నాభిన్నమైన వ్యవస్థల్లో అతి తక్కువ సమయంలోనే మార్పు తీసుకురాగలిగారని వ్యాఖ్యానించారు. పట్టాలు తప్పిన వ్యవస్థను మరలా గాడిలో పెట్టారన్నారు. కనుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారని మల్లాది విష్ణు ఉద్ఘాటించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, హెచ్.ఓ.(పార్కు) ఎం.నాగేశ్వరరావు, డివిజన్ ఇంచార్జి బెవర నారాయణ, డివిజన్ అధ్యక్షులు బత్తుల దుర్గారావు, నాయకులు ఇస్మాయిల్, బాబు, ఆర్.ఎస్.నాయుడు, శ్యామల రావు, కిరణ్, ఫాతిమా, ఉమా, వీఎంసీ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.