విస్తారంగా మొక్కలు నాటిన వైఎస్ఆర్సిపి శ్రేణులు
రేపు రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు : ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కృషితో ఆయన పిలుపు మేరకు
మంగళవారం నరసన్నపేట నియోజకవర్గంలో విస్తారంగా మొక్కలు నాటే కార్యక్రమం
నిర్వహించారు. తొలుత పోలాకి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మాజీ
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, స్థానిక జడ్పిటిసి డాక్టర్ ధర్మాన కృష్ణ
చైతన్య తదితరులు మొక్కలు నాటారు. అక్కడే విద్యార్థులకు పలు ఆటల పోటీలు
నిర్వహించారు. అనంతరం పోలాకి మండలం పరిషత్ కార్యాలయం ఆవరణం లో మొక్కలు నాటే
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య
హాజరయ్యారు.
నరసన్నపేట మండల పరిషత్ ప్రాంగణం లో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ
చింతురామారావు, వైస్ ఎంపీపీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు , సర్పంచ్ లు,
ఎంపీటీసీలతో కలిసి కృష్ణదాస్ మొక్కలు నాటారు. వరుసగా రెండవ రోజు మొక్కలు నాటే
కార్యక్రమం గోపాలపెంటలో నిర్వహించారు. పోతయ్యవలస గ్రామం సచివాలయంలో మొక్కలు
నాటారు. బొరిగివలస గ్రామ సచివాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో
రాష్ట్ర పొందర-కూరకుల కార్పొరేషన్ ఛైర్పర్సన్ రాజాపు హైమవతి అప్పన్న,
డైరెక్టర్ అధికార్ల సాంబమూర్తి, సర్పంచ్, ఎంపీటీసీ ప్రతినిధి బగ్గు రమణయ్య,
ఉప సర్పంచ్ విష్ణుసాయి శివగణేష్ తదితరులు మొక్కలునాటారు.
సీఎం వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా మబుగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
పాఠశాల క్రీడలను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా
ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు,
స్థానిక జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా
కార్యదర్శి సుందర్రావు మాస్టర్, లక్ష్మణ దాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం
సారవకోటలో మొక్కలు నాటి అక్కడ నుంచి నేరుగా శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల
ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ప్రిన్సిపల్ సురేఖ ఆద్వర్యంలో విద్యార్థులతో
కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు,
తూర్పు కాపు కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ లు మామిడి శ్రీకాంత్, అందవరపు
సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవి.పద్మావతి, వర్కింగ్ ప్రెసిడెంట్
శిమ్మ రాజశేఖర్, పార్లమెంట్ పరిశీలకులు డాక్టర్ దానేటి శ్రీధర్, జిల్లా వక్ఫ్
బోర్డ్ చైర్మన్ శిజ్జు మహమ్మద్, అందవరపు రమేష్, కింజరాపు రమేష్, చల్లా అలివేలు
మంగ, సుగుణ రెడ్డి, పొన్నాడ ఋషి, ఎన్ని ధనుంజయ, మూకళ్ళ తాత బాబు, కనపల తేజ
తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడులకలను విద్యార్థులు, నిరుపేదలతో జరుపుకోవాలని
వైసిపి ఇప్పటికే పిలుపునిచ్చింది. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, నిరుపేదలకు
దుస్తుల పంపిణీ, అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలను జరపాలని
నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా తొలి రెండు రోజులు పార్టీ శ్రేణులు పెద్ద
ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాయి. అలాగే పర్యావరణాన్ని కాపాడేలా మొక్కలు కూడా
నాటాయి. 21వ తేదీన భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను
నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి
చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ దాస్ తెలిపారు.