బరువు పెరగడానికి ఒక సంకేతాన్ని పంపుతుంది. అలాగే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్
తినకపోవడం వల్ల రోజంతా ఎక్కువగా తినేలా చేస్తుంది.
సాధారణంగా డిన్నర్ చేశాక చాలా గ్యాప్ తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు.
అల్ఫాహారం తినకపోవడం వల్ల శక్తి ఉండదు. శక్తినీ కోల్పోతారు.
బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల ప్రయోజనాలు:
మన మెదడు సక్రమంగా పనిచేసేందుకు ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా ముఖ్యం. బ్రెయిన్
చురుకుగా పనిచేయడానికి బ్రేక్ ఫాస్ట్ తోడ్పడుతుంది.
మనల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. ఎముకల కీళ్ళకు, కండరాలకు శక్తిని అందిస్తుంది.
బ్రేక్ ఫాస్ట్ తర్వాత శరీరంలోని కండరాల కదలికకు శక్తి అందుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ మానేయడం సరికాదు.
ఇలా చేయడం వల్ల లంచ్, డిన్నర్ ఎక్కువ కేలరీలు తీసుకుంటారు. దీంతో బరువు
పెరుగుతారు. దాంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.