స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము..
అధిక ఫైబర్ కంటెంట్ స్వీట్ కార్న్ ప్రయోజనాలలో ఒకటి. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థతో
సహా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
1.స్వీట్ కార్న్ తింటుంటే రక్తపోటు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ను అదుపులో
వుంచుంది. గుండె జబ్బులను నివారించడంలో పాత్ర పోషిస్తుంది.
2.మొక్కజొన్న తినడం ఆరోగ్యకరమైన మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఇది
జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది.
3.గర్భధారణ సమయంలో మహిళలకు ఫోలేట్ మేలు చేస్తుంది.
4.పసుపురంగులో ఉన్న మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి
కళ్లకు ఎంతో మేలు చేస్తాయి.
5.మొక్కజొన్న తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
6.మొక్కజొన్న ఎక్కువగా తింటే, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్,
హేమోరాయిడ్లకు కారణం కావచ్చు.