జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది కథానాయిక
రెజీనా. ఇప్పుడు మరోసారి తన నటనతో అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.
తాజాగా ఆమె బాలీవుడ్ కధానాయకుడు నవాజుద్దీన్ సిద్దిఖీతో ‘సెక్షన్108’ చిత్రంలో
కలిసి నటించినట్టు సినీవర్గాలు తెలిపాయి. రషీక్ ఖాన్ తెరకెక్కిస్తున్న ఈ
చిత్రాన్ని అనీస్ బళ్ళీ సమర్పిస్తున్నారు. బీమా సంస్థల్లో జరిగే భారీ
కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సినిమావాలా వెంచర్ సంస్థ
నిర్మిస్తోంది. రెజీనా ఈ చిత్రంలో బీమా విచారణ అధికారి శిఖా అనే సవాలుతో కూడిన
పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమె భాగమైనందుకు సంతోషంగా ఉంది అని
సన్నిహితవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు
సమాచారం.