మీకు తగినంత శక్తి లభిస్తుంది. రాత్రంతా తినకపోవడం వల్ల మీకు తగినంత శక్తి
ఉండదు. ఇలాంటి సమయంలో బ్రేక్ ఫాస్ట్ ఎనర్జీ అందించి రోజంతా ఉల్లాసంగా ఉండేలా
చేస్తుంది.
ఏకాగ్రత పెంచేలా:
మీ మెదడు చురుగ్గా ఉండేందుకు బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. కాగ్నిటివ్ ఫంక్షన్
మెరుగ్గా ఉండటంలో అల్పాహారం కీలకపాత్ర పోషిస్తుంది. అల్పాహారం ద్వారా మీ
మెదడుకు పోషకాలు లభించి ఏకాగ్రత పెరుగుతుంది.
బరువు:
చాలామంది బ్రేక్ ఫాస్ట్ మానేయడం ద్వారా బరువు తగ్గుతాం అనుకుంటారు. కానీ ఇది
తప్పు. పోషకాలతో కూడిన అల్పాహారం తినడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుందని
అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రతిరోజూ అల్పాహారం తినడం మర్చిపోకండి.
తగిన పోషకాలు:
రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు.
దీనిని భర్తీ చేసేందుకు బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా అవసరం. తృణధాన్యాలు, పండ్లు,
మొక్కల ఆధారిత ప్రోటీన్స్, లీన్ ప్రోటీన్స్ వంటివి అల్పాహారంలో తీసుకోవడం
ద్వారా మీ బాడీకి కావాల్సిన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ లభిస్తాయి.
రక్తంలో చక్కెర:
రెగ్యులర్ గా అల్పాహారం తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో
ఉంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారితో పాటు ప్రిడయాబెటిస్ లక్షణాలతో ఉన్నవారు
బ్రేక్ ఫాస్ట్ తినడం చాలా అవసరం.
మెటబాలిజం:
సరైన సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల శరీర జీవక్రియ రేటు పెరుగుతుంది.
తద్వారా తీసుకున్న ఆహారం శక్తిగా మారి మీరు ఉల్లాసంగా ఉంటారు.
మంచి మూడ్:
మీ మూడు మెరుగుపర్చడంలో బ్రేక్ ఫాస్ట్ సహాయపడుతుంది. చికాకు, కోపం వంటివి
తగ్గించడంలో దోహదపడుతుంది.
దీర్ఘకాలిక వ్యాధులకు చెక్:
ప్రతిరోజూ ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి
కాపాడుకోవచ్చు. ఒబెసిటీ, గుండె సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు
వంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
సానుకూల దృక్పథం:
ప్రతి రోజూ సరైన సమయంలో బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల మీలో సానుకూల దృక్పథం
పెరుగుతంది. ఆరోగ్యంపై, ఫిట్ నెస్ పై దృష్టిపెట్టిన వారవుతారు. అందువల్ల
రెగ్యులర్ అల్పాహారం తినడం మంచిది.