ఇందుకు తగ్గట్టుగా వ్యాయామాలు సైతం చేస్తారు. కానీ ఫిట్ గా ఉండరు. దీనికి
కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. ఈ ఆహార పదార్థాలతో ఫిట్ గా ఉండవచ్చు..
ఆవు పాలు:
ప్రతిరోజూ ఆవు పాలు తాగడంతో శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి.
హైడ్రేట్ గా ఉండవచ్చు. ఎముకలు దృఢంగా మారుతాయి. కండరాలు ఆరోగ్యంగా మారుతాయి.
ఆవు పాలు మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతాయి.
డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని
సులభంగా అందిస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, మినరల్స్, పుష్కలంగా ఉంటాయి.
వీటిని ప్రతిరోజూ తినడంతో ఫిట్ గా ఉండవచ్చు.
స్వీట్ పొటాటో:
చిలగడ దుంపల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఉన్న బీటా కెరోటిన్, ఐరన్,
విటమిన్ సి శక్తి స్థాయిలను పెంచుతాయి. క్రమం తప్పకుండా స్వీట్ పొటాటో తినడంతో
ఫిట్ గా ఉండవచ్చు.
బ్రోకలి:
బ్రోకలిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్న
మినరల్స్, పోషకాలు ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తాయి. ఇవి మిమ్మల్ని నిత్యం
చురుకుగా ఉంచుతాయి.
అరటి:
ఫిట్ నెస్ ను మెరుగుపర్చడంలో అరటి
సహాయపడుతుంది. అరటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బీ, పొటాషియం
శక్తి స్థాయిలను రెట్టింపు చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
టమాటా:
టమాటాలో విటమిన్ సీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు
ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బ్రెజిల్ నట్స్:
బ్రెజిల్ నట్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడంతో
వ్యాధినిరోధకశక్తి
మెరుగుపడుతుంది. ఇందులో సెలీనియం కంటెంట్ కూడా లభిస్తుంది. ఇది గుండెను
ఆరోగ్యంగా మార్చుతుంది. బ్రెజిల్ నట్స్ తినడంతో ఫిట్ గా ఉండవచ్చు.
సాల్మన్:
సాల్మన్, ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్లను తినడంతో శారీరక, మానసిక ఆరోగ్యం
మెరుగుపడుతుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా
మార్చుతాయి. మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతాయి.