సహాయపడుతుంది. విటమిన్ కె అధికంగా లభించే పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం..
కాలే:
కాలేలో విటమిన్ కె ఎక్కువగా లభిస్తుంది. కాలే తినడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని
కాపాడుకోవచ్చు.
బ్రకోలి:
బ్రకోలీలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది వృద్ధాప్య ఛాయలను నివారించి
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని ల్యూటిన్, సల్ఫోరాఫెన్ చర్మాన్ని
అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి.
పాలకూర:
పాలకూరలో విటమిన్ కెతో పాటు విటమిన్ ఎ, బి, ఇ, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.
ఇవి చర్మాన్ని మృదువుగా మార్చి, ముడతల్ని నివారిస్తాయి.
లెట్యూస్:
లెట్యూస్ లోనూ విటమిన్ కె అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో నీటి శాతం అధికమే.
దీనివల్ల ఇవి తింటే చర్మం పీహెచ్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. జిడ్డు చర్మం
నుంచి విముక్తి పొందవచ్చు.
బ్రస్సెల్ స్ప్రౌట్స్:
బ్రస్సెల్ స్ప్రౌట్స్ లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా
ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని రెట్టింపు చేసి చర్మాన్ని ఆరోగ్యంగా
మారుస్తాయి.
సోయా బీన్స్:
ముడతల్ని నివారించి అకాల వృద్ధాప్య ఛాయల్ని అడ్డుకోవడంలో సోయా బీన్స్
సహాయపడతాయి. వీటిలోని విటమిన్ కె చర్మాన్ని బిగుతుగా, మృదువుగా మారుస్తుంది.
గుమ్మడికాయ:
విటమిన్ కె ఎక్కువగా లభించే ఆహారాల్లో గుమ్మడి కాయ ఒకటి. అలాగే వీటిలో
సాలిసిలిక్ యాసిడ్, బీటా కెరోటిన్ కూడా ఎక్కువే. ఇవి ముడతలు, నల్ల మచ్చలు
తగ్గించడంలో సహాయపడతాయి.
పైన్ నట్స్:
చర్మాన్ని ఆరోగ్యంగా మార్చి యవ్వనపు కాంతిని అందించడంలో పైన్ నట్స్
సహాయపడతాయి. ఇందులోని విటమిన్ కె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బ్లూబెర్రీ:
బ్లూబెర్రీలను యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌజ్ చెప్పవచ్చు. అలాగే వీటిలోని
విటమిన్లు, మినరల్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని
నివారిస్తాయి.తద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.