కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.
ఖర్జూరాలను తినడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. బరువు తగ్గుతారు:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే బరువు తగ్గుతారు. కాబట్టి బరువు
తగ్గాలనుకునే వారు నిద్ర నుంచి లేచిన తర్వాత తప్పనిసరిగా ఖర్జూరాన్ని తినాలి.
ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఆకలిని కలిగించదు.
2. ఎనర్జీ పెరుగుతుంది:
రోజూ ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది. నిజానికి, ఈ
తీపి పండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని
పెంచుతుంది.
3. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
కడుపు రుగ్మతలతో బాధపడేవారు తప్పనిసరిగా ఉదయాన్నే ఖర్జూరం తినాలి. ఇందులో ఉండే
ఫైబర్ జీర్ణక్రియ, పేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది మలబద్ధకం,
గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది.
తీపి పదార్థాలు తినడం తగ్గుతుంది:
చాలా మందికి స్వీట్స్ తినాలనే కోరిక ఉంటుంది. స్వీట్స్ ఎక్కువగా తింటే ఊబకాయం,
మధుమేహం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. తీపి తినాలనే కోరికలు
తగ్గించుకోవడానికి ఖర్జూరాలు మీకు బెస్ట్ ఆప్షన్. ఇది తీపి కోరికలను
తగ్గిస్తుంది.