ఉంటుంది.భారతదేశంలో 7.7కోట్ల మంది వయోజనులు డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు
అంచనా. ఈ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. షుగర్ పేషంట్స్ తీపి పదార్థాలను
అస్సలు తీసుకోరాదు. అయితే కొన్ని కూరగాయలు తినడం వల్ల మధుమేహగ్రస్తులకు
మంచిది.అవేంటో చూద్దాం..
పాలకూర: ఇందులో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారాన్ని వెంటనే జీర్ణం
కానివ్వదు. అందువల్ల ఆహారంలోని గ్లూకోజ్ మొత్తం వెంటనే రక్తంలో కలవదు. నెమ్మది
నెమ్మదిగా కలుస్తుంది. అందువల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు.
ఒక్కసారిగా పెరిగితే ప్రమాదం. పాలకూర అలా జరగనివ్వదు కావున డయాబెటిస్ ఉన్నవారు
పాలకూర తినడం మంచిది. పాలకూరలో పిండి పదార్థం ఉండదు. గ్లైసెమిక్ ఇండెక్స్
కూడా తక్కువే. అందువల్ల పాలకూర ఎట్టి పరిస్థితుల్లో గ్లూకోజ్ లెవెల్స్ ని
పెరగనివ్వదు. అందుకే దీన్ని తినమని వైద్యులు చెబుతుంటారు.
టమాట: టమాటాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి.అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇవి
మంచి ఆహారం. టమాటాలని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. వీటిలో విటమిన్ సి ఉంటుంది.
ఇవి మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. టమాటాల్లో ఉండే విటమిన్ A
కంటి చూపును మెరుగుపరుస్తుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి కంటి చూపు
సమస్యలుంటాయి. టమాటాల్లోని లైకోపీన్ గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతుంది.
ప్రొస్టేట్ కాన్సర్ తో పోరాడే శక్తి కూడా టమాటాలకు ఉంది.
బ్రకోలి: ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఎ , సి, కె
ఉంటాయి. అందువల్ల బ్రకోలీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. వ్యాధి
నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది. అందువల్ల తిన్న ఆహారం
వెంటనే జీర్ణం కాదు. ఫలితంగా రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవు.
బ్రకోలీలో గుండె సమస్యలు రాకుండే చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.