తరచుగా చేపలు తినమని చెబుతూ ఉంటారు. చేపలు తినడం వల్ల కంటికి మాత్రమే కాకుండా
ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఏ ఏ చేపల వల్ల ఎటువంటి ప్రయోజనాలు
కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
సాల్మన్:
ఈ చేపలల్లో ఒమేగా 3 ఉంటుంది. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం పెరుగుతుంది.
వ్యవసాయ సాల్మన్ అడవి సాల్మన్ కంటే తక్కువ ధరకే లభిస్తాయి. కాబట్టి వీటిని
చాలా మంది కొంటారు. కానీ, అడవి సాల్మన్ చేప చాలా మంచిది. ఇందులో విటమిన్,
మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ట్యూనా చేపలు:
ఈ చేపల్లో విటమిన్ బి 12, డిలు సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, ఐరన్ కంటెంట్ కూడా
ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా తక్కువ కొవ్వు, ప్రోటీన్స్ ఉంటాయి. పిల్లలు,
గర్భిణీలు తరచుగా వీటిని తినడం మంచిదని చెబుతారు నిపుణులు. అదే విధంగా,
క్యాన్డ్ ట్యూనా చేపలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రపంచంలోని అత్యంత
ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇది ఒకటి. దీనినే పొలుసుల చేప అని కూడా అంటారు. ఇందులో
విటమిన్ బి12, ఒమేగా 3లు ఎక్కువగా ఉంటాయి. ఈ చేప ప్రోటీన్ కి మంచి మూలం.
మంచినీటి ట్రౌట్:
ట్రౌట్ చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది.ఈ చేపల్లో ఒమేగా 3 కొవ్వులు ఎక్కువగా
ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్య నిపుణులు రెయిన్ బో
ట్రౌట్, అడవి ట్రౌట్ ని తీసుకోమని చెబుతారు. అలాగే చేపలు కొద్దిగా చూడ్డానికి
సార్డిన్ చేపల్లా ఉంటాయి. విటమిన్ బి మరియు జింక్ కి మంచి మూలం ఈ చేపలు.
హెర్రింగ్ చేపల:
ఈ చేపలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు ఆరోగ్యంగా ఉంటాయి.
హెర్రింగ్ చేపల్లో లభించే ప్రోటీన్ శరీరంలో హిమోగ్లోబిన్‌ని ఉత్పత్తి చేయడానికి
అవసరమైన ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది విటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆయిలీ
ఫిష్. సార్డినెస్ దాని చర్మం, ఎముకలు వినియోగించడం వల్ల ఎక్కువ పోషణని
అందిస్తాయి.
సార్డినెస్ చేపలు:
ఈ చేపలను తినడం ద్వారా గుండె జబ్బుల నుండి ఉపశమనం కలుగుతుంది. కొన్ని రకాల
క్యాన్సర్ల నివారణకి కూడా వీటిని తింటారు. ఇవి ఎముకలని బలంగా చేస్తాయి. రోగ
నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.