బాడీలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి జరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది.
1.నొప్పులు మాయం:
గోంగూర ఆకులను తీసుకుని వాటికి కొద్దిగా ఆముదం రాయాలి. ఆ ఆకులను వేడి చేసి
వాపు, గడ్డలు, నొప్పులు ఉన్నచోట కట్టులా కట్టాలి. దీంతో నొప్పి, వాపు
తగ్గుతుంది.
2.రేచీకటి:
రేచీకటితో బాధపడేవారు గోంగూరను తింటే మంచి ఫలితం ఉంటుంది. గోంగూర పూలను దంచి
అరకప్పు రసం చేసి దాన్ని వడకట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం
రెండుపూటలా తాగితే. కంటికి మంచి జరుగుతుంది.
3.విరేచనాలు:
గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయి.
మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరతో అన్నం తిన్నా కూడా విరేచనాలకు
చెక్ పెట్టవచ్చు.
4.జలుబు:
దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమస్యతో
బాధపడేవారు గోంగూర తినడం వల్ల ఫలితం ఉంటుంది.
5.చెడు కొలెస్ట్రాల్:
గోంగూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్
ను తగ్గిస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. జుట్టు ఒత్తుగా
పెరుగుతుంది.
6.పీరియడ్స్:
పీరియడ్స్ సమయంలో మహిళలు నొప్పులతో బాధపడుతుంటారు. నీరసంగా ఉంటారు. ఇలాంటి
సమయంలో గోంగూర తినడం వల్ల వారి శరీరానికి శక్తి లభిస్తుంది.
7.రోగనిరోధక శక్తి:
గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో
53 శాతం గోంగూరలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
8.చుండ్రు:
గోంగూర ఆకుల పేస్టు తలకు పట్టించి కొంతసేపు అయ్యాక స్నానం చేయాలి. దీనివల్ల
జుట్టు రాలడం, చుండ్రు సమస్య తగ్గుతుంది.