వ్యవస్థ మొదలగు వాటికి ఈ విటమిన్ తోడ్పడుతుంది.
సెనగలు:
సెనగలలో విటమిన్ బీ6 బాగా ఉంటుంది. సెనగలను మీ ఆహారంలో తీసుకుంటే శరీరానికి
విటమిన్ బి6 ఎక్కువ మొత్తంలో లభిస్తుంది.
పాలు:
పాలలో కాల్షియమ్, కోలిన్, పోటాషియమ్ తో పాటు విటమిన్ బీ6, బీ12, ఉంటాయి. ఇవి
ఎముకల దృఢత్వానికి ఉపయోగపడతాయి.
సాల్మోన్ ఫిష్:
టునా, సాల్మోన్ లాంచి చేపల్లో విటమిన్ బీ16 పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే
శరీరానికి ఈ విటమిన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది.
అవకాడో:
అవకాడోలో కూడా విటమిన్ బీ6 ఎక్కువగా ఉంటుంది. అలాగే,ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్స్,
ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం కూడా ఉంటాయి.
అరటి పండ్లు:
అరటి పండ్లలోనూ విటమిన్ బీ6, మెగ్నిషియమ్ పుష్కలంగా ఉంటాయి. కావున అరటి
పండ్లను కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి.
పాలకూర:
పాలకూర లోనూ విటమిన్ బి6 అధికంగా ఉంటుంది.
క్యారెట్:
క్యారెట్లోనూ విటమిన్ బీ6 అధిక మొత్తంలో లభిస్తుంది.