చెర్రీ పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే వీటికి చాలా
ప్రాముఖ్యతనిస్తుంటారు వైద్యులు. అనేక రుగ్మతలను పారదోలడంలో ఇవి కీలక పాత్ర
పోషిస్తాయి. పుల్లని చెర్రీలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా..
ప్రాముఖ్యతనిస్తుంటారు వైద్యులు. అనేక రుగ్మతలను పారదోలడంలో ఇవి కీలక పాత్ర
పోషిస్తాయి. పుల్లని చెర్రీలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా..
1.కడుపు మంట, కురుపులు వంటివి నయం చేసే శక్తి చెర్రీ పండ్లకు వున్నాయి.
2.టైప్-2 డయాబెటిస్, గుండె వ్యాధులకు దారితీసే ఇన్ఫ్లమేషన్ ను నివారించటంలో
చెర్రీ ఉపయోగపడుతుంది.
3.ఆస్టియో ఆర్ధరైటిస్, రుమరాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటిని నిరోధించగల మంచి ఔషదం.
4.చెర్రీలలో కొవ్వు తక్కువ, నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు చాలా తక్కువ.
5.స్థూలకాయం తగ్గించుకోవడానికి ఆహారంలో చెర్రీలను తినడం ఉత్తమం.
6.చెర్రీలోని ‘యాంథోసియానిన్’లు ట్యూమర్ పెరుగుదలను, క్యాన్సర్ ను
నిరోధిస్తాయి.
7.విమానాలలో అధిక దూరాలు ప్రయాణం చేసేవారు నిద్రపోవటానికి గంట ముందుగా
ఎండబెట్టిన చెర్రీలను తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.