పదార్దాలను వ్యాయమం చేశాక 20 నిమిషాల లోపు తినడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.
శక్తిని పొందవచ్చు.
గ్రీక్ యోగర్ట్:
వ్యాయామం తర్వాత గ్రీక్ యోగర్ట్ తినడంతో మంచి ఫలితాలు పొందవచ్చు. గ్రీక్
యోగర్ట్ బెర్రీస్ లేదా తేనె కలుపుకొని తినవచ్చు. వీటిని తినడంతో శరీరానికి
కావాల్సిన పొటాషియం, కాల్షియం అందుతుంది.
అవకాడో టోస్ట్
హొల్ గ్రెయిన్ బెడ్, అవకాడో టోస్ట్ తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం
తర్వాత తినడానికి ఇది సరైనది. వీటిని తినడంతో శరీరానికి కావాల్సిన యాంటీ
ఆక్సిడెంట్లు, ఫోలేట్, మెగ్నీషియం లభిస్తుంది. శక్తి రెట్టింపు అవుతుంది.
అరటి:
వ్యాయమం తర్వాత కోల్పోయిన శక్తిని తిరిగి పొందేందుకు అరటిని తినడం ఉత్తమం.
అరటిలో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శక్తిని అందిస్తుంది.
డార్క్ చాక్లెట్:
వ్యాయామం తర్వాత డార్క్ చాక్లెట్ తినడం సరైనది. డార్క్ చాక్లెట్ తినడంతో
శరీరానికి కావాల్సిన కొవ్వులు, ప్రోటీన్స్ లభిస్తాయి. డార్క్ చాక్లెట్ తినడంతో
ఒత్తిడి తగ్గుతుంది.
బాదం:
బాదం తినడంతో శరీరానికి కావాల్సిన శక్తి సులభంగా అందుతుంది. బాదంలో
ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.
ఖర్జూరం:
ఖర్జూరంలో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. వర్కౌట్ తర్వాత తినేందుకు ఇది
సరైనది. వీటిని తినడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు సులభంగా అందుతాయి.
యాపిల్:
వ్యాయమం తర్వాత యాపిల్ తినడం ఎంతో మంచిది. యాపిల్ తో పాటు బటర్ తినడంతో
రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి కండరాలను ఆరోగ్యకరంగా, దృఢంగా
మార్చుతాయి.
చిలగడదుంపలు:
చిలగడదుంపలో కేలరీలు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి
ఆరోగ్యాన్ని అందిస్తాయి. వర్కౌట్ చేసిన తర్వాత కోల్పోయిన శక్తిని అందిస్తాయి.