ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. మరి విటమిన్-డి లభించే ఆహార
పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం..
పాల ఉత్పత్తులు:
పాలు, యోగర్ట్, చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్-డి అధికంగా ఉంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల విటమిన్ లోపం నుంచి బయటపడొచ్చు.ఇవి మనకు ఎక్కడైనా
సులభంగా లభిస్తాయి. ఈ ఉత్పత్తుల్ని భోజనం, స్నాక్స్ లాంటి వాటిలో భాగం
చేసుకోవచ్చు.
చేపలు:
సాల్మన్, ట్రౌట్, మాకెరల్, సార్డినెస్ వంటి చేపల్లో కొవ్వు శాతం ఎక్కువగా
ఉంటుంది. వీటి ద్వారా మనకి విటమిన్-డి లభిస్తుంది. ఈ చేపల్ని తినటం వల్ల
విటమిన్-డి స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా ఎముకల దృఢంగా మారుతాయి. రోగనిరోధక
శక్తి కూడా మెరుగవుతుంది.
గుడ్డు సొన:
రోజూ గుడ్డు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులోని తెల్లసొనలో
ప్రొటీన్ లు పుష్కలంగా ఉంటాయి.అలాగే పచ్చసొనలో విటమిన్-డి ఎక్కువగా ఉంటుంది.
మన ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల విటమిన్-డి లోపాన్ని సులువుగా
అధిగమించొచ్చు.
పుట్ట గొడుగులు:
కొన్ని రకాల పుట్టగొడుగుల జాతుల్లో విటమిన్-డి సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా
అడవి జాతి పుట్టగొడుగుల్లో ఈ విటమిన్-డి అధికంగా ఉంటుంది. ఇవి మనకి సూపర్
మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంటాయి.
కాడ్ లివర్ ఆయిల్:
కాడ్ లివర్ ఆయిల్ అనేది కాడ్ అనే చేప కాలేయం నుంచి తయారు చేస్తారు. విటమిన్-డి
ఎక్కువగా దొరికే అతి తక్కువ పదార్థాల్లో ఇదొకటి.ఇందులో విటమిన్-డితో పాటు
ఐకోసపెంటెనోయిక్ యాసిడ్, డోకోసహెక్సేనోయిక్ యాసిడ్ వంటి ఒమేగా-3 కొవ్వు
ఆమ్లాలు కూడా ఉంటాయి.