ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం,
ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము..
ఆకు కూరలు,తృణ ధాన్యాలు:
ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు,
తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి.
సిట్రస్ ఫ్రూట్స్:
విటమిన్ సి ఎక్కవగా ఉన్న పండ్లని తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది.
విపరీతమైన డైటింగ్ చేయకండి:
డైటింగ్ అతిగా చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను
నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది.
విటమిన్ డి:
విటమిన్ డి కోసం కొద్దిసేపు ఎండలో కూర్చోవాలి. చేపలు, గుడ్లు, పాలు, బాదం,
మొలకెత్తిన ధాన్యాలు మొదలైనవి తింటుండాలి.
ప్రోటీన్:
ఎముకలను పటిష్టంగా వుండేందుకు తగినంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎందుకంటే ఎముకలు 50
శాతం ప్రోటీన్ తో తయారవుతాయి.
గాఢ నిద్ర:
గాఢ నిద్రలో లో ఉన్నప్పుడే గ్రోత్ హార్మోన్ స్రవిస్తుంది, ఇది ఎముకల
అభివృద్ధికి దారితీస్తుంది కనుక గాఢ నిద్ర అవసరం.