చెబుతున్నారు. నట్స్ అన్నింట్లో కల్లా వాల్ నట్స్ బలమైన ఆహారం. వీటిని
ఆక్రోట్స్ అని కూడా పిలుస్తారు. రోజుకు 4 వాల్ నట్స్ నానబెట్టి తింటే అనేక
ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంద్దాం..
పోషకాలు:
వాల్ నట్స్ లో విటమిన్ B6, E, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్
యాసిడ్, మెగ్నీషియం, రాగి, సెలీనియం, ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి అనేక
పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మెదుడుకి:
వాల్ నట్స్ లోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
ఏకాగ్రతను పెంచుతాయి. అల్జీమర్స్, డిమెన్షియా వచ్చే అవకాశం తగ్గిస్తాయి.
రక్త హీనత:
వాల్ నట్స్ విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్, ఐరన్, మాంగనీస్
వంటి పోషకాలు ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ కూడా సమృద్ధిగా ఉంటుంది. రోజూ వాల్ నట్స్
తింటే రక్తహీనత దూరం అవుతుంది.
జీర్ణక్రియకు:
వాల్ నట్స్ లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మేలు చేస్తుంది. అలాగే
ప్రీబయోటిక్ కాంపౌండ్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు
బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.
బరువు తగ్గుదల:
వాల్ నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కడుపును నిండుగా ఉంచుతుంది.
ఆకలిని తగ్గిస్తుంది. దీంతో తక్కువగా తింటారు. ఇది బరువును అదుపులో ఉంచుతుంది.
కీళ్ల నొప్పులు:
వాల్ నట్స్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రోజూ
వాల్ నట్స్ తింటే ఆర్ద్రరైటిస్ తో వచ్చే నొప్పులు, వాపులు క్రమంగా తగ్గుతాయి.
ఎముకలు దృఢంగా:
వాల్ నట్స్ లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం
చేయడానికి సహాయపడుతుంది.
గుండెకు మేలు:
ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ ను
పెంపొందిస్తాయి.
బ్రెస్ట్ క్యాన్సర్ కి చెక్:
రోజూ వాల్ నట్స్ తింటే బ్రెస్ట్ క్యాన్సర్ రిక్స్ తగ్గుతుందని అధ్యయనాలు
పేర్కొన్నాయి.