చర్మాన్ని అందంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే కొన్ని ఆహారాలు తినడం ద్వారా
చర్మాన్ని అందంగా ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం..
అవకాడో:
అవకాడో పండ్లలో మోనోశాచురేటెడ్, పాలీశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా
ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి కాంతివంతంగా మారుస్తాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో అందాన్ని కాపాడే విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని
హైడ్రేట్ గా మార్చి మృదువుగా ఉంచుతుంది. అలాగే చర్మాన్ని మాయిశ్చరైజ్
చేస్తుంది.
టమాటో
టమాటోల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ముఖంపైన మొటిమలు, మచ్చల్ని
తొలగించడంలో సహాయపడుతుంది.
క్యారెట్
పొడిబారిన చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చేందుకు క్యారెట్లు సహాయపడతాయి. అలాగే
ఇందులోని పొటాషియం చర్మం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. హానికర యూవీ కిరణాల
నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
బ్లూబెర్రీ
ఈ పండ్లలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై మచ్చలు, మొటిమలు,
నల్లమచ్చల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
స్వీట్ పొటాటో
స్వీట్ పొటాటోల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా
మార్చి ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది.
వాల్ నట్స్
చిన్న వయసులో వచ్చే వృద్ధాప్య ఛాయల్ని నివారించడంలో వాల్నట్స్ సహాయపడతాయి.
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి చర్మానికి రంగు ఇస్తుంది.
సబ్జా గింజలు
చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరచడానికి సబ్జా గింజలు సహాయపడతాయి. ఇది మొటిమలు,
నుదురుపై నలుపు, నల్ల మచ్చలు పోగొట్టడంలో దోహదపడతాయి.