వల్ల మేలు జరుగుతుంది..
1. మామిడి:
మామిడి పేరు వినగానే నోటిలో నీళ్లు ఊరడం ఖాయం. వేసవి కాలంలో దొరికే మామిడి
పళ్లు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా
పెంచుతుంది.
2. నిమ్మకాయ:
నిమ్మకాయ రసంలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని
మెరుగుపరచడంతో పాటు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
3. అరటిపండు:
అరటిపండు తీసుకోవడం ఎంత సులభమో, అంత ప్రయోజనకరంగా ఉంటుంది. అరటిపండ్లను మితంగా
తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
4. పైనాపిల్:
పైనాపిల్ తింటే గుండెపోటు రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. అయితే, రక్తంలో చక్కెర
స్థాయిని పెంచే కారణంగా షుగర్ పేషెంట్స్ పైనాపిల్ కు దూరంగా ఉంటేనే మంచిది.
5. క్యాప్సికమ్:
పసుపు రంగు క్యాప్సికం లో ఫైబర్, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి. ఇది
శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. అదే సమయంలో రక్త హీనత సమస్యను కూడా
పరిష్కరిస్తుంది. గుండె నీ ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.