ఆరోగ్యంగా ఉంచుకోవడంతో నలుగురి మధ్యలోకి వెళ్లినప్పుడు ఆత్మవిశ్వాసంతో
ఉండవచ్చు.
బ్రష్
ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు సార్లు బ్రష్ చేయాలి.
రెండు నిమిషాల పాటు బ్రష్ చేయడంతో దంతాలు ఆరోగ్యంగా మారుతాయి. చిగుళ్లు
సమస్యలు దరిచేరవు.
ఫ్లాసింగ్
రెగ్యులర్ గా ఫ్లాసింగ్ చేయడంతో దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు
సులభంగా బయిటకుపోతాయి. అయితే ఫ్లాసింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఒకసారి
ప్లాసింగ్ చేస్తే చాలు.
ఫ్లోరైడ్:
బ్రష్ చేసిన తర్వాత ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న మౌత్ వాష్ ను ఉపయోగించాలి. ఈ మౌత్
వాష్ లను ఉపయోగించడంతో దంతాలు ఆరోగ్యంగా మారుతుంది. ఇవి నోటి ఉన్న చెడు
బ్యాక్టీరియాను తొలగిస్తాయి.
పోషకాహారం
చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండటం, పండ్లు, కూరగాయలు
అధికంగా తినడంతో దంతాల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి.
ఆహారం తిన్న తర్వాత
ఆహారం తిన్న తర్వాత ప్రతిసారి మంచి నీటితో నోటిని పుక్కలించాలి. ఇలా చేయడంతో
నోరు శుభ్రం అవుతుంది. ఎటువంటి చక్కెర పేరుకుపోదు. దీంతో చిగుళ్లు ఆరోగ్యంగా
మారుతాయి.
ధూమపానం
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ధూమపానం చేయడంతో నోటి ఆరోగ్యం చెడిపోతుంది.
ముఖ్యంగా చిగుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. పొగతాగడంతో వ్యాధినిరోధకశక్తి
తగ్గుతుంది.
ఆయిల్ పుల్లింగ్
ఆయిల్ పుల్లింగ్ చేయడంతో నోటిలోని చెడు బ్యాక్టీరియా తొలగుతుంది. ఆయిల్
పుల్లింగ్ చేయడంతో చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. కొబ్బరి నూనె, సన్ ఫ్లవర్
ఆయిల్‌తో 10 నిమిషాల పాటు ఆయిల్ ఫుల్లింగ్ చేయడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.
డెంటిస్ట్
ప్రతి ఆరునెలలకు ఒక సారి వైద్యుడిని కలవడం ఎంతో అవసరం. దంతాలకు సంబంధించి ఏ
చిన్న సమస్య వచ్చినా డెంటిస్ట్‌ను కలవడంతో దంత సమస్యలు దూరం అవుతాయి.