ఇలాంటి వారు కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా జ్వరాన్ని సులువుగా
తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం..
ధనియాలు:
మొక్కల ఆధారిత ఫైటో న్యూట్రియంట్స్ ధనియాల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో
జ్వరాన్ని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి.
తిప్పతీగ:
ఆయుర్వేదంలో తిప్పతీగను ఔషధంగా వినియోగిస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి
జ్వరం, జలుబు వంటివి తరచూ రాకుండా కాపాడుతుంది.
తులసి టీ:
తులసిలో యూజినాల్, సిట్రోనెల్లాల్, లినోలూల్ అనే యాంటీ బ్యాక్టీరియల్
సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జ్వరం ఉన్నపుడు తులసి టీ తాగితే ఉపశమనం
కలుగుతుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి జ్వరం, జలుబు
వంటి అనారోగ్య సమస్యల నుంచి వేగంగా ఉపశమనం కలిగిస్తాయి.
ఉసిరి:
ఉసిరిలో రోగనిరోధక శక్తిని రెట్టింపు చేసే విటమిన్ సి అధికంగా ఉంటుంది. జ్వరం
ఉన్న సమయంలో రోజూ ఉసిరి రసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అల్లం టీ:
అల్లంలో యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రతిరోజూ అల్లం తాగడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు రాకుండా ఉంటాయి. ఇందులో
చక్కెరకు బదులు తేనె ఉపయోగించడం మంచిది.
యాపిల్ సిడార్ వెనిగర్:
జ్వరానికి మరొక అద్భుతమైన సహజ చికిత్స యాపిల్ సిడార్ వెనిగర్. ఇది బరువు
తగ్గించడంలోనే కాదు జ్వరాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
నీరు:
జ్వరం ఉన్న సమయంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎక్కువగా నీటిని తాగాలి.
ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చెమట వల్ల కోల్పోయిన లవణాల్ని భర్తీ
చేస్తుంది.