గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో పోషకాలు
సైతం మెండుగా ఉన్నాయి.
ఇన్ఫెక్షన్లు దూరం:
దాల్చినచెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా
ఉంటాయి. ఇవి సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాను తొలగిస్తాయి. దాల్చినచెక్కను
రెగ్యులర్ గా తీసుకోవడంతో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను దరి చేరవు.
కణాల ఆరోగ్యం:
దాల్చినచెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాల్లో ఆక్సీకరణ
ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలు ఆరోగ్యంగా మారుతాయి.
వాపు తగ్గుతుంది:
దాల్చినచెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి దెబ్బతిన్న
కణజాలన్ని బాగుచేస్తాయి. వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అర్థరైటిస్ నొప్పిని
సైతం తగ్గిస్తాయి.
షుగర్ కంట్రోల్:
దాల్చినచెక్కను రెగ్యులర్ గా తీసుకోవడంతో శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు
పెరుగుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దాల్చినచెక్క
జీర్ణవ్యవస్థలో కార్బోహైడ్రేట్ ల విచ్ఛిన్నత ప్రక్రియ నెమ్మదించేలా చేస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
దాల్చినచెక్కతో సిన్నమేట్ అనే సమ్మేళనం కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో
సహాయపడుతుంది. దాల్చినచెక్కను రెగ్యులర్ గా తీసుకోవడంతో శరీరంలోని చెడు
కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు దరి చేరవు.
బీపీ కంట్రోల్:
దాల్చినచెక్క రెగ్యులర్ గా తీసుకోవడంతో రక్తపోటు సైతం స్థిరంగా మారుతుంది.
దీంతో గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం
తగ్గుతుంది.
మొటిమలు మాయం:
చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చడంలో దాల్చినచెక్క సహాయపడుతుంది.
దాల్చినచెక్క మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దాల్చిన చెక్క
పొడిలో మూడు స్పూన్ల తేనె కలిపి చర్మానికి రాసుకోవాలి. దీంతో మెటిమలు రావు.
యాంటీ క్యాన్సర్ ఏజెంట్:
దాల్చిన చెక్కలో యాంటీ క్యాన్సర్ ఏజెంట్ మాదిరి పని చేస్తుంది. దాల్చిన
చెక్కను తీసుకోవడంతో క్యాన్సర్ కణాల వృద్ధి చెందవు. దాల్చినచెక్కను రెగ్యులర్
గా తీసుకోవడంతో పెద్దప్రేగు క్యాన్సర్ రాదు.