పడుతుంటారు. దీని వల్ల జుట్టు రాలిపోతోంది. ఈ చిట్కాలు పాటించడం వల్ల
వెంట్రుకలు చిట్లడాన్ని నివారించవచ్చు. అవేంటో చూద్దాం..
అలోవెరా:
వెంట్రుకల చివర్లను అలోవెరా జెల్ తో మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
ఇది వెంట్రుకలను మృదువుగా, మెరిసేలా మార్చడంతో పాటు చిట్లడాన్ని నివారిస్తుంది.
కోడిగుడ్లు:
వెంట్రుకలు పొడిగా మారి గజిబిజిగా ఉండటాన్ని నివారించేందుకు కోడిగుడ్లును
ఉపయోగించవచ్చు. కోడిగుడ్ల తెల్లసొన తీసుకుని దానిలో కాస్త నిమ్మరసం కలిపి
వెంట్రుకలకు మసాజ్ చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం ద్వారా ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంతో
పాటు వెంట్రుకల పాడు అవ్వడాన్ని మరియు వెంట్రుకలు
చిట్లడాన్ని నివారిస్తుంది.
యోగర్ట్:
జుట్టును నిగనిగలాడేలా చేసి, చివర్లు చిట్లడాన్ని నివారించడంలో యోగర్ట్
సహాయపడుతుంది. యోగర్ట్ ఆలివ్ ఆయిల్ కలిపి దానికి కాస్త నిమ్మరసం కలిపి
జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల వరకు ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ఫలితం
ఉంటుంది.
బొప్పాయి:
బొప్పాయితో యోగర్ట్ కలిపి జుట్టుకు పట్టించడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఇవి జుట్టును మృదువుగా చేసి వెంట్రుకలు చిట్లడాన్ని నివారిస్తాయి.
కొబ్బరి నూనె:
జుట్టును ఆరోగ్యంగా మార్చే అనేక పోషకాలు కొబ్బరినూనెలో ఉంటాయి. ఇవి జుట్టును
మృదువుగా, నిగనిగలాడేలా చేస్తాయి. అలాగే చివర్లు చిట్లడాన్ని తగ్గిస్తుంది.
ఆర్గాన్ ఆయిల్:
ఆర్గాన్ ఆయిల్ కూడా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని ఒమెగా-3 ఫ్యాటీ
యాసిడ్స్ జుట్టుకు తేమను అందిస్తాయి.
తేనె:
జుట్టుకు అంటుకున్నట్లు ఉన్నా కూడా వెంట్రుకలని నిగనిగలాడేలా చేయడంలో తేనే
సహాయపడుతుంది. తేనెకు కాస్త ఆలివ్ ఆయిల్, యోగర్ట్ కలిపి ఈ మిశ్రమాన్ని
జుట్టుకు పట్టించాలి. వారానికి ఒకసారి చేసినా ఫలితం ఉంటుంది.