ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే.అలాంటి ముఖ్యమైన పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి.
పొటాషియం అధికంగా ఉండే పదార్థాలు ఏమిటంటే..
యోగర్ట్:
యోగర్ట్ లో కాల్షియం, రైబోఫ్లేవిన్ తో పాటు పొటాషియం అధికంగా ఉంటుంది. ఓ కప్పు
యోగర్ట్ లో దాదాపు 380 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది ఆకలిని, బరువును
నియంత్రణలో ఉంచదానికి తోడ్పడుతుంది
కొబ్బరినీళ్లు:
శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడంలో కొబ్బరినీళ్లు మెరుగ్గా పనిచేస్తాయి. వీటిలోని
పొటాషియం వంటి ఆవశ్యక మినరల్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అవకాడో:
అవకాడోలో గుండెకు మేలు చేసే మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. అలాగే వీటిలో
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, కె, బి6తో పాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
అరటి పండ్లు:
పొటాషియం ఎక్కువగా లభించే పండ్లలో అరటి పండు ముందుంటుంది. ఓ అరటి పండులో
దాదాపు 451 మిల్లీ గ్రాముల పొటాషియం లభిస్తుంది. అలాగే వీటిలో మెగ్నీషియం,
ఫైబర్, విటమిన్ సి, బి6, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
నారింజ:
సిట్రస్ జాతి పండైన నారింజలో విటమిన్ సితో పాటు పొటాషియం అధికంగా ఉంటుంది.
అలాగే ఇందులో ఫోలేట్, విటమిన్ ఎ, థయామిన్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
టొమాటో:
టొమాటోల్లోనూ పొటాషియం అధికంగా ఉంటుంది. ఓ కప్పు టొమాటోల్లో 728 మిల్లీ
గ్రాముల పొటాషియం అధికంగా ఉంటుంది. క్యాన్సర్ నిరోధించే లైకోపీన్ కూడా అధికంగా
ఉంటుంది.
పాలకూర:
పాలకూరలో కూడా పొటాషియం అధికంగా లభిస్తుంది. ఓ కప్పు పాలకూరలో 839 మిల్లీ
గ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బీట్ రూట్:
అర కప్పు బీట్ రూట్ ముక్కల్లో దాదాపు 259 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది.
దీంతో పాటు ఫోలేట్స్, మాంగనీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి రక్తపోటును
నివారిస్తాయి.
బంగాళాదుంప:
బంగాళాదుంపలో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల పొటాషియం లోపంతో
బాధపడేవారు డైట్ లో బంగాళాదుంప చేర్చుకోవడం ఉత్తమం.