సృష్టిస్తోంది. ఈజీ.5.1గా వర్గీకరించిన ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి
చెందుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనిపై ప్రపంచ
ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఈజీ.5.1 అనే పేరుతో మరో వేరియంట్
పుట్టుకొచ్చింది. ఈ మేరకు యునైటెడ్ కింగ్డమ్-యూకేలో ఆ కొత్త వేరియంట్ కేసులు
వమోదవుతున్నాయని.. ఆ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని యూకే ఆరోగ్య విభాగం
అధికారులు వెల్లడించారు. ప్రతి ఏడు కరోనా కేసుల్లో ఈ కొత్త వేరియంట్ కేసు ఒకటి
ఉంటోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియాలో కొవిడ్ కేసులు
పెరుగుతున్న తరుణంలో యుకేలో ఈ వేరియంట్ నమోదైందని యూకే హెల్త్ సెక్యూరిటీ
ఏజెన్సీ- యూకేహెచ్ఎస్ఏ వెల్లడించింది. ఈ వేరియంట్‌ను జులై 31న EG.5.1గా
వర్గీకరించారని చెప్పింది. దీన్ని ఎరిస్ (Eris) అనే పేరుతో కూడా
పిలుస్తున్నారని.. ఈ పరివర్తనాన్ని కొత్త వేరియంట్‌గా ప్రకటించడం వల్ల
డీటెయిల్డ్ క్యారెక్టరైజేషన్, విశ్లేషణకు వీలు కలుగుతుందని పేర్కొంది.
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కొత్త వేరియంట్‌పై అధ్యయనం చేస్తోంది.
రెండు వారాలుగా ఈజీ.5.1ను ట్రాక్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ వైరస్‌తో తీవ్రమైన
ముప్పు ఏమీ లేదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు. ప్రజలంతా
కొవిడ్ టీకాల నుంచి రక్షణ పొందిన నేపథ్యంలో వైరస్ ప్రభావం అంతగా ఉండబోదని
అన్నారు. అయితే, యూకే హెల్త్ అథారిటీ డేటా ప్రకారం ఆ దేశంలోని మొత్తం కేసుల్లో
14.6 శాతం కేసులు కొత్త వేరియంట్‌వే ఉంటున్నాయి. అదేసమయంలో సాధారణ కొవిడ్ కేసుల
సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది.
“ఈ వారం మొత్తం కరోనా కేసులు పెరగడాన్ని గమనించాం. ఆస్పత్రుల్లో చేరే వారి
సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. అన్ని వయసుల వారూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సంఖ్య అధికంగా ఉంది. అయితే, మొత్తంగా చూస్తే ఆస్పత్రి
అడ్మిషన్లు చాలా తక్కువగానే ఉన్నాయి. ఐసీయూ అడ్మిషన్లలో పెరుగుదల కనిపించలేదు.
పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని యూకేహెచ్ఎస్ఏ ఇమ్యూనైజేషన్ హెడ్
డాక్టర్ మేరీ రామ్సే తెలిపారు.
కేసుల పెరుగుదల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు
సూచిస్తున్నారు. తరచుగా చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. కరోనా లక్షణాలు
ఏవైనా కనిపిస్తే సాధ్యమైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండాలని డాక్టర్ మేరీ రామ్సే
పేర్కొన్నారు. కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తే వాటి గురించి సమాచారాన్ని
ఎప్పటికప్పుడు పంచుకుంటామని స్పష్టం చేశారు.