మలేషియాలో మళ్లీ మాస్క్
వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వుండడమే ఇందుకు కారణం. అక్టోబర్ 23, 29 మధ్య14,525 కేసులు నమోదయ్యాయి. తద్వారా మలేషియాలో కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య 16.5% పెరిగి 16,917 కేసులకు చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రి ఖైరీ జమాలుద్దీన్ తెలిపారు.