హెల్ది డైట్ అంటే తిండి మానేయడం కాదు టైం సరిగా సరిపోయేంత ఆరోగ్యకరమైన ఆహరం తినడం. అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ టైం కి చేయడం.. అదికూడా పోషకాలతో కూడిన ఆహరం తినడం. స్టోన్ ఫ్రూట్స్ ఇవి కాలానుగుణంగా దొరికేవి. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తింటే అసలు డాక్టర్స్, హాస్పిటల్స్ తో పనే ఉండదు. ఒకవేళ పండ్లు అలాగే నేరుగా తినలేకపోతే రకరకాల పళ్లతో మంచి సలాడ్ చేసుకోవచ్చు. తీపిని ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. స్నాక్స్ లో పండ్లు తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెరిగేలా చేస్తుంది. స్టోన్ ఫ్రూట్స్ తక్కువ-జిఐ, తక్కువ క్యాలరీల, మరియు విటమిన్లు సి, ఎ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. -ఇవి బరువు తగ్గడానికి ఉపకరిస్తాయి.
ఉదాహరణకు : ఒక మీడియం పీచు (150 గ్రాములు) 58 కేలరీలను కలిగి ఉంటుంది. అయితే 1 కప్పు (130 గ్రాములు) చెర్రీస్ 87 కేలరీలను అందిస్తుంది. రెండు చిన్న రేగు పండ్లు (120 గ్రాములు) లేదా నాలుగు ఆప్రికాట్లు (140 గ్రాములు) కేవలం 60 కేలరీలు కలిగి ఉంటాయి. చిప్స్ లేదా కుక్కీలు వంటి అనారోగ్యకరమైన చిరుతిండి ఆహారాలతో పోలిస్తే, స్టోన్ ఫ్రూట్లు మరింత పోషకాలు కలిగిస్తాయి.