అబ్బాయి కావాలా ..అమ్మాయి కావాలా…. పుట్టడానికి ముందే మీరే
నిర్ణయించుకోవచ్చని ఇటీవలి పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇది కొద్దిగా
వివాదాస్పదమైన అంశమే అయినప్పటికీ ఫెర్టిలిటీ విషయంలో తాము జరిపిన పరిశోధనలు 80
శాతం వరకు విజయవంతం అయ్యాయని నిపుణులు చెప్తున్నారు. వీర్యకణాలను విశ్లేషించడం
ద్వారా ఇది సాధ్యమైందని, వీర్యకణాల బరువు ఆధారంగా వాటిని వర్గీకరించడం
జరిగిందని పి ఎల్ ఓ ఎస్ వన్ అనే మ్యాగజైన్లో పొందుపరిచారు. ఈ కొత్త అధ్యయనం
ప్రకారం బరువు ఆధారంగా వీర్య కణాలను వేరు చేసే విధానం చాలా ఖచ్చితమైనది మరియు
సురక్షితంగా కనిపిస్తోందన్నారు . దాదాపుగా 1300 మంది జంటలను పరిశోధకులు తమ
అబ్జర్వేషన్ లో ఉంచారు. వారి నుంచి సేకరించిన వీర్యకణాలను దాని సాంద్రత, బరువు
ఆధారంగా వర్గీకరించారు. స్త్రీకణంగా చెప్పే ఎక్స్ క్రోమోజోమ్ కొద్దిగా
బరువుగా ఉందని .,అలాగే పురుషకణంగా చెప్పే వై క్రోమోజోమ్ బరువు తక్కువగా ఉందని
ఈ పరిశోధనలో తేలింది. న్యూయార్క్ సిటీ లోని వీల్ కార్నర్ మెడిసిన్ సంస్థలో
గైనకాలజీ , ఎంబ్రాలజీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ జియన్ పిరో
పల్లెర్మో అనే పరిశోధకుడు ఈ అంశాలను వివరించారు. వీర్యకణాలు తమ ప్రయాణంలో ఈత
కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు తేలికగా ఉన్న కణాలు పైపైన ప్రవహిస్తుంటే.,
బరువుగా ఉన్న కణాలు క్రింది భాగంలో పయనిస్తున్నట్టుగా తమ పరిశోధనలో తేలిందని
అన్నారు. ఈ రకంగా పురుష స్త్రీ కణాలను వర్గీకరించిన నేపథ్యంలో దీని ఆధారంగానే
దంపతులకు అబ్బాయి కావాలా.. అమ్మాయి కావాలా.. అనే అంశాన్ని వైద్య నిపుణులే
నిర్ధారించవచ్చని ఆయన వెల్లడించారు
“మేము స్పెర్మ్ దట్టమైన మాధ్యమంలోకి ఈత కొట్టడానికి అనుమతిస్తాము,” అని అతను
చెప్పాడు. “ఇది చాలా సులభమైన కాన్సెప్ట్; తేలికైన స్పెర్మ్ పైకి లేస్తుంది,
అయితే భారీ స్పెర్మ్ దిగువకు వెళ్తుంది.” అని అన్నాడు.
తరువాత, పరిశోధకులు ఒక స్పెర్మ్‌ని ఎంచుకుని, గుడ్డు మధ్యలోకి ఇంజెక్ట్
చేస్తారు. ఇది ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) అని పిలువబడే
ప్రక్రియ. దీని ద్వారా ఎవరు కావాలంటే వారిని పుట్టించవచ్చని చెపుతున్నారు.
భవిష్యత్తులో, సంతానోత్పత్తి చికిత్సలు అవసరం లేని జంటలకు కూడా ఈ విధానం
సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.