ఇంగ్లాండులో గర్భం దాల్చిన పదిమంది మహిళలలో 9 మందికి కడుపులోని శిశువునకు
సంబంధించిన సమస్యలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు . వారు నిర్వహించిన
పరిశోధనలో గర్భస్థ శిశువులకు అనారోగ్యం ఉన్నట్టు తేలింది . గర్భిణీ మహిళలు
ధూమపానం చేయడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా
ప్రెగ్నెన్సీ కి ముందు ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోవడం వల్ల గర్భస్థ శిశువుకు
అనారోగ్య పరిస్థితులు కనిపించాయని వారి పరిశోధనలో తేలింది. సౌత్ఆంఫ్టన్ బయో
మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో మొత్తం 6,50,000 మంది గర్భిణులను
పరిశీలించినప్పుడు ఈ దిగ్భ్రాంతికర వివరాలు వెల్లడయ్యాయి. వాస్తవానికి గర్భం
దాల్చే ముందు వారు ఆరోగ్యంగానే ఉన్నారు . అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత
వారిలో అనారోగ్య సూచికలు కనిపించాయి . ఒకవేళ బిడ్డ పుట్టినా కూడా ఆ పిల్లలకు
దీర్ఘకాలిక సమస్యలను కలిగి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.2018 సంవత్సరం ఏప్రిల్ నుంచి 2019 వ సంవత్సరం మార్చి మధ్యకాలంలో ఆరోగ్య
కార్యకర్తలు తిరిగి ఆరు లక్షల 52 వేల ఎనిమిది వందల ఎనభై మంది ప్రెగ్నెంట్
మహిళల వివరాలు సేకరించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, ఇతర పరిస్థితులను
గమనించినప్పుడు తల్లితోపాటు బిడ్డకు కూడా ఏదో ఒక రిస్క్ ఉన్నట్టు గమనించారట.
ఈ వివరాలను BJOG అనే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆప్స్ ట్రిక్స్ అండ్ గైనకాలజీ
మ్యాగ్జన్లో ప్రచురించారు. 23 శాతం మంది ధూమపానం అలవాటు కలిగినవారే కాబట్టి
వారికి పుట్టే పిల్లలలో సమస్యలు గుర్తించారు. 85% మంది గర్భిణీ స్త్రీలు
ప్రెగ్నెన్సీ వచ్చేవరకు ధూమపానం తీసుకోవడం వల్ల వీరికి కూడా సమస్యలు
కనిపించాయని పరిశోధకులు వెల్లడించారు.