డేటా చౌర్యం… ఇదేదో బ్యాంకులలో డేటాను తస్కరిస్తున్నారని మీరు అనుకోవచ్చు
కానీ., ఇటీవల ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని కూడా కొందరు అదే పనిగా
తస్కరించేస్తున్నారు. మొబైల్ ఫోన్లలో వినియోగించే థర్డ్ పార్టీ యాప్స్
ద్వారా, అలాగే ఇంటర్నెట్లో మీరు వెతికే ఆరోగ్య సంబంధిత అంశాల ద్వారా ఈ డేటా
దొంగతనానికి గురవుతోంది. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్యం . మానసిక ఆరోగ్య సంబంధిత
సమస్యలు ,వాటికి సంబంధించిన సమాచారాన్ని డేటా బ్రోకర్స్ తస్కరిస్తున్నారు.
వాటిని విక్రయించుకుంటున్నారని కూడా డ్యూక్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో
బయటపడ్డాయి ఇది చట్టబద్ధమా ..కాదా ..అన్న అంశాన్ని పక్కన పెడితే మీ వ్యక్తిగత
ఇన్ఫర్మేషన్ మాత్రం చౌర్యానికి గురవుతోంది.ఈ ప్రపంచంలో మన డేటా బయటకు పోకుండా ఉండాలంటే కంప్యూటర్ గాని మొబైల్ గాని
ఆఫ్లైన్లో పెట్టడం తప్ప మరో మార్గం లేదు. అయితే అది సాధ్యం కాని పని కాబట్టి
ఆయా యాప్లను ఆఫ్లైన్లో పెట్టడం మాత్రమే ఒక మార్గంమని చెబుతున్నారు. అయితే ఈ
ఆరోగ్య డేటాను ఎందుకు తస్కరిస్తున్నారనే అంశంపై డ్యూక్ యూనివర్సిటీ సాన్ఫర్డ్
స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ జరిపిన పరిశోధనలో దిగ్బ్రాంతి కరమైనటువంటి అంశాలు
తేలాయి. వివిధ ఆరోగ్య సమస్యలు., మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారి వివరాలు
ఔషధ తయారీ సంస్థలకు చేరుతున్నాయట . ముఖ్యంగా డిప్రెషన్ ., యాంగ్జైటీ., ఉదర
సంబంధిత సమస్యలతో బాధపడే వారి వివరాలను ఈ డేటా బ్రోకర్లు మందుల తయారీ
కంపెనీలకు చేరుస్తున్నారట. అలా తమకు అందిన సమాచారాన్ని విశ్లేషించుకుని ఆయా
కంపెనీలు సదరు రోగులతో మాట్లాడుతున్నాయి. వారికి కావలసిన మందులను
అమ్ముకుంటున్నాయి. టోటల్ గా చెప్పాలంటే.. ఇది ఒక వ్యాపారంగా మారిపోయిందని
తెలుస్తుంది. కొందరు డేటా బ్రోకర్లతో ఈ పరిశోధకులు మాట్లాడినప్పుడు దాదాపుగా
11 ప్రముఖ కంపెనీలకు లక్షలాదిమంది ఆరోగ్య సమాచారాన్ని వీరంతా విక్రయించినట్లు
తేలింది. వీరంతా ఉదర సంబంధిత వ్యాధులు, మతిమరుపు వ్యాధులు., యాంగ్జైటీ తో
బాధపడుతున్న వారేనట. వారి పేర్లు , చిరునామాలు వారి ఆదాయ పరిస్థితిని కూడా ఈ
డేటా బ్రోకర్లు తస్కరించి కంపెనీలకు చేరవేస్తున్నారట. ఇలా మందుల వ్యాపారం
జోరుగా సాగుతోందని డ్యూక్ యూనివర్సిటీ ని పనులు హెచ్చరిస్తున్నారు.