వస్తాయని చెబుతుంటారు . ఇందులో నిజం ఎంత.. అసలు వాస్తవాలు ఏంటి.. అనే అంశాల్ని
ఇప్పుడు చూద్దాం . పాలు తీసుకోవడం వల్ల చాలావరకు అవాంచిత ఆరోగ్య సమస్యలు
వస్తాయని చెబుతారు. అంతేకాదు మొటిమలు వస్తాయనీ, కడుపులో మంట పెరుగుతుందనీ
బరువు పెరుగుతారని కూడా ప్రచారం ఉంది .అయితే ఇదంతా అన్ని సందర్భాల్లోనూ నిజం
కాదు . వాస్తవానికి పాలు తాగడం వల్ల పోషకపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే వ్యక్తులు లాక్టోస్ పడని వారు, పాల
పదార్ధాల వల్ల అలర్జీ వచ్చేవారు మినహా మిగిలిన వారందరికీ పాలు తాగడం మంచిదేనని
ఆహార నిపుణులు చెబుతున్నారు.ఎనిమిది ఔన్సుల పాలు – అంటే దాదాపుగా 240 ml పాలు తీసుకుంటే అందులో నుంచి 8
గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే శరీరానికి కావలసిన విటమిన్ బి 12 మోతాదులో
50% వరకు పాల ద్వారానే లభిస్తుంది. శరీరానికి కావలసిన క్యాల్షియం 25% వరకు పాల
నుంచే లభిస్తుంది. ప్రతిరోజు శరీరానికి కావలసిన పొటాషియం, విటమిన్ డి విషయంలో
15% వరకు ఈ 240 ml పాలు ద్వారా లభిస్తుంది. అంతేకాదు శరీరానికి కావలసిన 122
క్యాలరీల శక్తి కూడా పాల నుంచే లభిస్తుంది. ఎముకలకు సంబంధించిన పటిష్టతకు
కాల్షియం , విటమిన్ డి అవసరం కాగా అది పాల నుండే లభిస్తుంది.
పాలు తాగడం వల్ల బరువు పెరుగుతుందనే దురభిప్రాయాలు బాగా ఎక్కువగా వస్తున్నాయి.
అయితే పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే – ప్రతిరోజూ నిర్దిష్ట పరిమాణంలో పాలు
సేవిస్తే దానివల్ల బరువు పెరిగే అవకాశాలు లేవని చెప్తున్నాయి. అంతేకాకుండా ఒక
సమాన బరువు మెయింటైన్ చేయడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.
పాలలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఫ్యాట్ కూడా సమాన నిష్పత్తులలో కలిగి
ఉండడం వల్ల ఇది బరువుని పెంచే అవకాశం లేదు అని అంటున్నారు.
వైద్య నిపుణులు చేసినటువంటి ఈ పరిశోధనలు న్యూట్రియంట్ జర్నల్ లో
ప్రచురితమయ్యాయి. పాలు తీసుకోవడం పై జరిపిన మెటా విశ్లేషణలు ఏం
చెబుతున్నాయంటే – నిర్దిష్ట పరిమాణంలో పాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే
అవకాశం లేదని అంటున్నారు . పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల
గణనీయంగా బరువు తగ్గలేదు కానీ అలాగని బరువు పెరగడానికి కూడా దారి తీసిన
పరిస్థితులు లేవు కాబట్టి మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే పాలు ఒక పరిమాణంలో
తీసుకోండి. ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం కోసం అయితే ప్రతిరోజూ ఒక గ్లాసు
పాలు తీసుకోవడం మంచిది – అని సూచిస్తున్నారు.