ప్రపంచ దేశాల మధ్య కరోనా మహమ్మారి నివారణ ఒప్పందంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఆధ్వర్యంలో చర్చలు ప్రారంభ మయ్యాయి. భవిష్యత్ మహమ్మారి అత్యవసర పరిస్థితుల
నుంచి దేశాలు, సంఘాలను రక్షించడానికి ఒక ఒప్పందంపై చర్చలు జరపడానికి “జీరో
డ్రాఫ్ట్” రూపొందించారు. 194 దేశాలతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఇంటర్‌గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ (INB) వారపు నాల్గవ సమావేశంలో డ్రాఫ్ట్
పాండమిక్ ఒప్పందంపై చర్చలు జరిగాయి. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ నిర్దేశించిన
టైమ్‌టేబుల్ ప్రకారం డ్రాఫ్ట్‌పై చర్చలు వచ్చే ఏడాది పాటు కొనసాగుతాయి.
నెదర్లాండ్స్‌కు చెందిన INB బ్యూరో కో-చైర్ రోలాండ్ డ్రైస్ ఇలా అన్నారు:
“ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మహమ్మారి ఒప్పందం కోసం కాంక్రీట్ లాంగ్వేజ్ చర్చలు
ప్రారంభమయ్యాయి. ప్రపంచ దేశాలు సురక్షితమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం
కలిసి పనిచేయాలనుకుంటున్నాయని స్పష్టమైన సంకేతాన్ని పంపుదాం. భవిష్యత్తులో
కరోనా మహమ్మారిని నిరోధించగలుగుతాము” అని అన్నారు.