ఇది ఆరోగ్యకరం అంటోన్న పోషకాహార నిపుణుడు భువన్ రస్తోగి
భారతీయ వీధుల్లో విలువైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. వివిధ రకాలైన
చాట్లను ప్రజలు ఎక్కువగా కోరుకుంటారు. ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పానీ పూరీ
నుంచి పాప్రీ చాట్ లేదా దహీ భల్లా వరకు, చాలా మంది ఈ రుచికరమైన ఆహార
పదార్థాలను తినాలని కోరుకుంటారు., అవి చాలా రుచికరమైనవి. అదనపు కేలరీలు నూనెల
కారణంగా అవి చాలా అనారోగ్యకరమైనవి అని కూడా నమ్ముతారు.
అందుకని చాలా మంది తమ ఆరోగ్యం, ఫిట్నెస్ను అదుపులో ఉంచుకోవడానికి చాట్లకు
దూరంగా ఉంటారు. “సంవత్సరాలుగా చాట్ తినని వారిని నేను చాలా మందిని
చూస్తున్నాను. ఇది తమ ఆరోగ్యానికి హానికరం అని భావించి మొత్తం అలాంటి వాటిని
తొలగించారు’’ అని పోషకాహార నిపుణుడు భువన్ రస్తోగి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో
పేర్కొన్నారు.
అయితే చాట్లను తినడాన్ని తగ్గించాల్సిన అవసరం లేదని ఆయన జోడించారు.
ఎందుకంటే బయటి నుంచి తీసుకునే ఏదైనా ఆహారం సాధారణంగా అధిక మొత్తంలో నూనెను
ఉపయోగించి చేస్తారు.కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా గ్రేవీతో కూడిన నాన్లో
కూడా నూనె, క్రీమ్, లేదా జీడిపప్పు పేస్ట్‌తో క్రీమీగా ఉంటుందని భువన్ రస్తోగి
వెల్లడించారు.