విజయవాడ : ఈనెల 26న విజయవాడ పశ్చిమ లోని కేబీఎన్ కళాశాలలో ఆర్య వైశ్య ఉచిత
పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వాసవి విజయవాడ గౌరవ అధ్యక్షులు
తూనుగుంట్ల శ్రీనివాస్, అద్యక్షులు తేలప్రోలు వీరయ్య గుప్త, కార్యదర్శి చిట్ట
అమర్ సుధీర్, కోశాధికారి లక్ష్మీ నారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి
ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు.
వాసవి విజయవాడ సంస్థ ఆర్య వైశ్యులకు సేవ చేయుట కోరకు 1991 లో స్థాపించబడి
ఇప్పటికి 32 సంవత్సరములు గడిచాయని తెలిపారు. మంగళవారం వారు ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం జనవరి జూలై నెలలో
వివాహ పరిచయ వేదికలు, 2012 నుండి పునర్వివాహ పరిచయ వేదికల క్రమం తప్పకుండా
నిర్వహిస్తున్నదన్నారు. ఈ క్రమంలో 62వ ఉచిత వివాహ పరిచయ వేదిక ను 26న గురువారం
ఉదయం 10 గంటలకు కేబీఎన్ కళాశాలలో, 17వ ఆర్య వైశ్య పునర్వివాహ పరిచయ వేదికను
మధ్యాహ్నం రెండుగంటలకునిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆర్య వైశ్యులకు
పూర్తిగా ఉచితంగా వధూవరులను ఒకే వేదిక పైకి తీసుకుని రావాలనేది సంస్థ సంకల్పం.
ఈ కార్యక్రమము పూర్తిగా డిజిటల్ రూపం లో జరుగుతుంది. ఇందులో ఎవరైనా నమొదు
చూసుకోవాలంటే గూగుల్ ఫారం ద్వారా ప్రపంచం లో ఎక్కడ నుండి అయినా నమోదు
చేసుకోవచ్చు. కార్యక్రమానికి విచ్చేసిన వధూవరులతో పాటు, వారికి తోడుగా వచ్చిన
మరొకరికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తారు. ఈ సదుపాయాన్ని ఆర్య వైశ్యులు అందరూ
వినయోగించు కోవాలని కోరారు. సమావేశంలో వాసవి విజయవాడ గౌరవ అధ్యక్షులు
తూనుగుంట్ల శ్రీనివాస్, అద్యక్షులు తేలప్రోలు వీరయ్య గుప్త, కార్యదర్శి చిట్ట
అమర్ సుధీర్, కోశాధికారి లక్ష్మీ నారాయణ, కన్వీనర్ జల్లూరి నాగ శ్రీనివాసరావు,
పరిచయ వేదిక కన్వీనర్ యు.వి. పుల్లారావు పాల్గొన్నారు.