కళ్ళు అందంగా,ఆరోగ్యంగా కనపడితే ముఖం కూడా కాంతిగా మెరుస్తూ ఉంటుంది. అందుకే
కళ్లను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకోవాలి. మనం తీసుకునే సహజ సంరక్షణ కళ్ళను
మెరుగ్గా ఉంచుతుంది. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తూ చేసే సాధారణ తప్పులు
పెను సమస్యలకు దారితీస్తాయి. కంటి సంబంధిత సమస్యలతో చాలా సందర్భాల్లో చేసే
సాధారణ తప్పులు కళ్లకు హాని కలిగిస్తాయి. ఇతర ఇంద్రియ అవయవాల కంటే కళ్ళు చాలా
ముఖ్యమైనవి. ఎక్కువ మంది ప్రజలు సరైన సంరక్షణను విస్మరిస్తారని, దాని ద్వారా
ప్రమాదాలు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి
నిద్ర, కొన్ని సహజ వైద్యాలు మీ కళ్ళకు మంటలు, ఎరుపు, ఇతర అసౌకర్యాలను దూరంగా
వుంచుతాయి. కళ్ళు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలని
నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్లపై చూడటం, సరైన నిద్ర లేకపోవడం వల్ల కళ్లకు
అపారమైన నష్టం కలుగుతుంది. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు,
ఇ-రీడర్లు, టెలివిజన్‌తో సహా డిజిటల్ స్క్రీన్లు కంటి ఒత్తిడి, తలనొప్పి,
అస్పష్టమైన దృష్టి లేదా డబుల్ దృష్టి, పొడి కళ్ళు, మెడ, భుజం నొప్పిని కూడా
కలిగిస్తాయి.
సాధారణ అలవాట్లలో భాగంగా కళ్లను రుద్దడం, లేదా కంటి చుక్కలను ఎక్కువగా
ఉపయోగించడం,ఇంకా చాలా మంది కళ్ళు కడగడానికి వెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది
కాదు. గది ఉష్ణోగ్రత నీరు, లేదా చల్లని నీటితో కడగడం అవసరం. ఇలాంటి నిబంధనలు
పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.