విటమిన్ ‘సి’ని పెంచుకోండిలా..
రక్తహీనత అనేది సాధారణంగా అందరిలో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ సమస్యగా ఉంది.
అయినప్పటికీ, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని బట్టి పరిస్థితి మారుతూ ఉంటుంది.
ఆహారంలో విటమిన్ సి రక్తం స్థాయిలను మెరుగుపరుస్తుందని హెలత్ నిపుణులు
కనుగొన్నారు. రక్తహీనత కలిగిన ఆహారంలో విటమిన్ సి పాత్ర, సిట్రస్ జ్యూస్ లేదా
విటమిన్ సి అధికంగా ఉండే ఇతర ఆహారాలు, అదే సమయంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారం
తీసుకోవడం వల్ల ఐరన్‌ను గ్రహించే శరీర సామర్థ్యాన్నిమెరుగుపరుస్తుంది.
ఆరోగ్యంతో పాటు రక్తహీనత తగ్గడానికి ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బిఎస్ కుమార్
పలు సూచనలు ఇస్తున్నారు.
– ఆరెంజ్ జ్యూస్, ఇతర సిట్రస్ డ్రింక్స్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఆహారంలోని
ఐరన్‌ను శరీరం శోషించడాన్నిమెరుగుపరుస్తుంది.
– బ్రోకలీ విటమిన్ సికి మంచి మూలం. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పదార్థం
అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.
– దానిమ్మ, గూస్బెర్రీ (ఉసిరి), నారింజ, అంజీర్, యాపిల్స్ వంటి పండ్లు,
కూరగాయల రసం ఆహారంలో ఉండాలి.
– బచ్చలికూర, బీట్రూట్, టొమాటో, క్యాబేజీ వంటి పదార్థాలు హిమోగ్లోబిన్
స్థాయిలను పెంచడానికి సహకరిస్తాయి.
– గూడుచీ రసం (గిలోయ్ జ్యూస్) కూడా రక్తహీనత చికిత్సకు చాలా ప్రయోజనకరంగా
ఉంటుంది.