ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ కమీషన్ అధ్యక్షులు డా.ఇక్బాల్ అహ్మద్ ఖాన్
అమరావతి సచివాలయం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గల వక్ఫ్ భూములు, ఆస్తులు,ఇనాముభూములు ఆక్రమణలకు గురి కాకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ కమీషన్ అధ్యక్షులు డా.ఇక్బాల్ అహ్మద్ ఖాన్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గల వక్ఫ్ భూములు, ఆస్తులు, ఇనాము భూములు చట్ట విరుద్దాముగా ఆక్రమణకూ గురవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, కావున ఆక్రమణల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ వారిని కోరినట్టు ఆయన తెలిపారు. ఏ విధమైన సేల్ డీడ్, మార్టిగేజ్ డీడ్, గిఫ్ట్ డీడ్, ట్రాన్స్ఫర్ డీడ్ మొదలగునవి ధర్డ్ పార్టీల నుండి వక్ఫ్ భూములల, ఇనాము భూములలో రిజిష్ట్రేషన్ చేయవద్దని అందరు సబ్ రీజిస్ట్రార్ లకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఇన్స్పెక్టర్ జనరల్ ని కోరినట్టు డా.ఇక్బాల్ అహ్మద్ ఖాన్ తెలియజేశారు. ఒకవేళ ఇప్పటికే ఎక్కడైనా చట్టవిరుద్ధంగా రిజిష్ట్రేషన్లు చేసిన సబ్ రీజిస్ట్రార్ల పై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా రిజిష్ట్రార్ జనరల్ ని ఆదేశించినట్టు రాష్ట్ర మైనార్టీస్ కమీషన్ అధ్యక్షులు డా.ఇక్బాల్ అహ్మద్ ఖాన్ తెలిపారు. అంతేగాక ఆవిధంగా చట్టవిరుద్ధంగా చేసిన రిజిష్ట్రేషన్లు తక్షణమే రద్దు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. అంతేగాక సిఇఓ వక్ఫ్ బోర్డు వారిని రాష్ట్రంలోని వక్ఫ్ భూములు, ఆస్తులు, ఇనాము భూముల వివరాలను సబ్ రీజిస్ట్రార్ లకు, రెవిన్యూ అధికారులకు తక్షణమే అందజేయాలని కూడా ఆదేశించినట్టు ఆయన తెలిపారు. అదే విధంగా కమిషనర్ వక్ఫ్ సర్వే వారిని రాష్ట్రం లోని అన్నీ వక్ఫ్ భూములు, ఆస్తులు, ఇనాము భూములకు సర్వే నిర్వహించవలసిందిగా ఆదేశించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ కమీషన్ అధ్యక్షులు డా.ఇక్బాల్ అహ్మద్ ఖాన్ తెలిపారు.