ఇద్దరు వ్యక్తుల చేతిలో 15 వేల యూఎస్ డాలర్లను మోసపోయిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. 62 ఏళ్ల ఇరాక్ జాతీయుడయిన అబ్బాస్ ఈ వారం గుర్గావ్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అతను అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ మృతదేహానికి అధికారులు ఇరాక్ ఎంబసీ అధికారుల సమక్షంలో శవపరీక్ష నిర్వహించారు. తనను, తన భార్యను మోసగించిన ఇద్దరు వ్యక్తులను అబ్బాస్ వెంబడించాడని, ఆ తర్వాత అతని పరిస్థితి మరింత దిగజారిందని అధికారులు వెల్లడించారు. అ తరువాత అతను ఆసుపత్రిలో చేరి మరణించాడని తెలిపారు.