కొత్త కరెన్సీ నోట్లపై మాతా లక్ష్మి, గణేశుడి చిత్రాలను ముద్రించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా ముస్లిం దేశమని, 85 శాతం ముస్లింలు, 2 శాతం హిందువులు మాత్రమే అక్కడ ఉన్నారని, అయిణా కరెన్సీపై గణేశుని చిత్రం ఉందని కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. కరెన్సీపై మహాత్మా గాంధీతో పాటు మాతా లక్ష్మి జీ, గణేష్ జీ చిత్రం ఉండాలన్నారు. దీని వల్ల వారి ఆశీస్సులు లభించి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపెతమవుతుందని అన్నారు.. “గాంధీ జీతో పాటు కరెన్సీపై లక్ష్మీ జీ, గణేష్ జీ చిత్రం ఉండాలి.
దీనివల్ల క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఆశీర్వదించబడుతుంది. అనేక చర్యలు తీసుకోవడంతో పాటు ఇది కూడా ఒకటి” అని ఆయన చెప్పారు. “ఇలా చేయడం ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని నేను చెప్పడం లేదు, చాలా కృషి చేయాల్సి ఉంటుంది. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు,” అన్నారాయన. ముద్రించిన కరెన్సీపై లక్ష్మి, గణేశుడి చిత్రాలను ఉంచే ఆలోచనను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఆమోదించారు. సిసోడియా ట్వీట్ లో ఇలా రాశాడు: “మా లక్ష్మి ,గణేశుడు శ్రేయస్సుకు సంబంధించిన చిహ్నాలు. వారి దీవెనలతో దేశం అభివృద్ధి చెందుతుంది, ముందుకు సాగుతుంది, నంబర్ వన్ అవుతుంది అన్నారు. “భారత కరెన్సీపై మహాత్మా గాంధీతో పాటు లక్ష్మి, గణేశుడి బొమ్మలు ఉంచడం దేశం మొత్తానికి శుభప్రదమని రుజువు చేస్తుంది,” అన్నారాయన.