2022-23 అసెస్మెంట్ సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు తేదీని నవంబర్ 7, 2022 వరకు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ ) బుధవారం పొడిగించింది. అంతకుముందు గడువు తేదీ అక్టోబర్ 31, 2022గా వుండేది. ‘ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అసెస్మెంట్ ఇయర్ 2022-23 కోసం ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 139లోని సబ్-సెక్షన్ (1) కింద ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు తేదీని పొడిగించింది. వారికి అక్టోబర్ 31, 2022 నుంచి నవంబర్ 07, 2022 వరకు గడువు పొడిగించాం ‘ అని అధికారిక ప్రకటన తెలిపింది.