టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించే సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంటాడు. యాడ్ల ద్వారాను భారీగానే ఆదాయాన్ని అర్జిస్తుంటాడు. ఆ ఆదాయాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించడంతో పాటు పలు బిజినెస్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘ఏమ్బీ సినిమాస్’ పేరుతో మల్టీప్లెక్స్‌ను లాంచ్ చేశాడు.
తాజాగా మరో బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేశ్ బాబు రెస్టారెంట్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. రెండు రెస్టారెంట్లను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.
తన భార్య నమ్రతా శిరోద్కర్ పేరున ఈ హోటళ్లను లాంచ్ చేయనున్నాడు. ఈ రెస్టారెంట్స్‌లో ఏషియన్ గ్రూప్‌నకు వాటా ఉంది. అందువల్ల ఈ హోటళ్లకు ఏషియన్-నమ్రత పేరు పెట్టారు. ఫస్ట్ రెస్టారెంట్‌ను మినర్వా-ఏఏన్ పేరున బంజరాహిల్స్‌లో నవంబర్‌లో ప్రారంభించనున్నారు. రెండో రెస్టారెంట్ ‘ప్యాలెస్ హైట్స్’ ను డిసెంబర్లో లాంచ్ చేయనున్నారు. ఈ బిజినెస్‌ను మొదట హైదరాబాద్‌లోనే లాంచ్ చేసినప్పటికి విజయవాడ, విశాఖ పట్నం వంటి నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. రెస్టారెంట్ బిజినెస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. గత కొన్నేళ్లుగా అనేక మంది సెలబ్రిటీలు వివిధ రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే.